ఇండియా రానంటున్న జకీర్ నాయక్

వివాదాస్పద వ్యాఖ్యలతో ఉగ్రవాదానికి ఊతమిచ్చేలా.. ప్రసంగాలు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పీస్ టీవీ నిర్వాహకుడు జకీర్ నాయక్. చాలా కాలం తర్వాత స్కైప్ లో మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం సౌదీఅరేబియాలో ఉంటున్న జకీర్ నాయక్ అందరూ చెబుతున్నట్లు తనకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవన్నారు.

ప్రస్తుతం జకీర్ ఎంట్రీపై కొన్ని దేశాలు బ్యాన్ విధించాయి. ప్రపంచ దేశాల నిర్ణయంపైనా జకీర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఏ టెర్రరిస్టుతోనూ.. సంబంధిత సంస్థలతోనూ సంబంధాలు లేవన్నారు. ఇక సోషల్ మీడియాలో ఓ ఉగ్రవాదితో ఉన్న ఫోటో ఇష్యూపై స్పందించిన జకీర్.. తనతో రోజూ వందల మంది ఫోటోస్ దిగుతుంటారని.. అంతమాత్రానా అందరితోనూ సంబంధాలున్నట్లేనా అని ప్రశ్నించారు.  తాను ఇండియాను వదిలిపెట్టేదీ లేదన్నారు. కాకపోతే ఈఏడాదంతా సౌదీలోనే గడపాలని నిర్ణయించుకున్నానని.. సంవత్సరం తరువాత ఇండియాకు తిరిగి వస్తానన్నాడు.