హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య

హనీమూన్ అనగానే జంట ఏకాంతంగా గడిపే రోజులు గుర్తుకు వస్తాయి.  అలాగే చాలా మంది పెళ్లైన కొత్తలోనే కాకుండా తర్వాత కూడా హనీమూన్ ను ప్లాన్ చేస్తారు. అలా రెండోసారి హనీమూన్ ప్లాన్ చేసిన ఓ జంటకు వీసా కష్టాలు వచ్చిపడ్డాయి. దాంతో హుమా అనే మహిళ ఒంటరిగా (అత్తామామలతో) హనీమూన్ కు వెళ్లింది. అవును... మీరు చదువుతున్నది అక్షరాల నిజం ఒంటరిగా హనీమూన్ కు వెళ్లిన ఆమె దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పాకిస్థాన్ కు చెందిన హ్యుమ అనే మహిళకు గ్రీస్ లో ఎదురైన వింత అనుభవం ఇది.

పాకిస్తాన్ లోని లాహోర్ కు చెందిన హుమా త‌న భ‌ర్త అర్స‌లాన్ తో క‌లిసి రెండోసారి హ‌నీమూన్ వెళ్లాల‌నుకుంది. వారితో పాటు అత్తామామ‌ల‌ను కూడా త‌మతో పాటు చారిత్రక గ్రీస్ తీసుకువెళ్లి స‌ర‌దాగా గ‌డ‌పాల‌నుకున్నారు. అనుకున్న‌ట్లుగానే అన్ని సిద్ధం చేసుకున్నారు. అయితే చివ‌రి నిమిషంలో గ్రీస్ ఎంబసీ అర్సలాన్ కు వీసా నిరాకరించడంతో వారి హ‌నీమూన్ ట్రిప్ మ‌లుపు తిరిగింది. దీంతో అత్తామామ‌తో క‌లిసి గ్రీస్ వెళ్లింది హుమా. అయితే త‌న భ‌ర్త ప‌క్క‌న లేకుండా ట్రిప్ వెళ్ల‌డంతో అత‌డు లేని లోటును వ్య‌క్త ప‌రస్తూ ప‌లు ప్రాంతాల్లో ఫొటోలు దిగిన హుమా త‌న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.