పువ్వుల చొక్కా వెనక మోదీ రాజకీయం

రోమ్ కు వెళితే రోమన్ లాగా ఉండాలి అనేది నానుడి. ఆ నానుడి బాగా తెలిసింది మన ప్రధాని నరేంద్ర మోదీకి. ఎన్నికలు ఉన్నా లేకున్నా పరిస్థితికి తగ్గట్టుగా మారిపోతుంటారు ఈయన. అస్సాంకి వెళితే అక్కడి గిరిజనుల వేషధారణలో, కశ్మీర్ కు వెళితే అక్కడి వారి పద్ధతులను పాటిస్తూ కశ్మీరీలా కనిపిస్తారు. తాజాగా సౌతాఫ్రికా వెళ్లిన మోదీ వేసుకున్న డ్రెస్ వార్తల్లో నిలిచింది. ఎప్పుడూ సూట్, కుర్తాలో కనిపించే ఆయన, పువ్వుల చొక్కాతో అందరికి షాకిచ్చాడు. అయినా మోదీకి తెలిసినంత చాణిక్యం ఎవరికీ తెలియదు అని చెప్పడానికి ఆయన చొక్కానే నిదర్శనం.

ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లినా, అక్కడి వాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఈశాన్య భారతం వెళితే అక్కడి సంప్రదాయ దుస్తుల్లో కనపడతారు. భూటాన్ వెళ్లినా అంతే. అమెరికా, ఆస్ట్రేలియా ఇలా ఏ దేశం వెళ్లినా.. అక్కడి మహనీయుల గురించి ప్రస్తావిస్తూ వారి మనుసుల్లో నాటుకుపోతారు. తాజాగా ఆఫ్రికా పర్యటనలో ఉన్న ఆయన.. దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడి ప్రవాస భారతీయుల సదస్సులో పాల్గొన్న ఆయన.. నెల్సన్ మండేలాను గుర్తుతెచ్చేలా.. మండేలా డ్రెస్ స్టైల్ ను ఫాలో అయ్యారు. దక్షిణాఫ్రికా జాతిపితగా ప్రపంచ మన్నలను అందుకున్న మహనీయుడిని అందరి మదిలో మరోసారి నిలిపారు మోదీ.