
ఏపి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ కు ఈడీ గట్టి షాకిచ్చింది. జగన్ కేసుల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరోసారి అతడి ఆస్తులను జప్తు చేసింది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న ఇంటిని, బెంగళూరులోని ప్యాలెస్ ను అటాచ్ చేసింది. అలాగే పలు కంపెనీల్లో జగన్, ఆయన సతీమణి భారతికి ఉన్న షేర్లను కూడా ఈడీ అటాచ్ చేసింది. వీటి విలువ రూ.750 కోట్లుగా లెక్కగట్టింది. ఓపెన్ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలుగా ఉంటుందని భావిస్తున్నారు.
అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం కాస్త రిలీఫ్ గా కనిపించిన జగన్ కు ఈడీ మరో తలనొప్పి తీసుకొచ్చిందని జగన్ సన్నిహితులతో అన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో సాక్షి మీడియాకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసి, భారతి సిమెంట్ ను కూడా తన ఛార్జిషీట్ లో పేర్కొంది. లోటస్ పాండ్ లో ఉన్న ఇంటిలో ప్రస్తుతం జగన్ నివాసం ఉంటున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దీనిని అటాచ్ చేసిన నేపథ్యంలో జగన్ ఈ ఇంటి నుంచి వెళ్లాల్సి ఉంటుందా? అన్న ప్రశ్న వస్తోంది. మొత్తానికి చాలా కాలంగా మరుగున పడిపోయిన జగన్ ఆస్తుల కేసు ఈడీ అటాచ్ తో మరోసారి పాపులర్ అయింది.