
అదేంటి టైటిల్ లో ఏదో తప్పుందని అనుకుంటున్నారేమో.. కానే కాదు. అక్షరాల నిజం. తన భార్యను తన ఆప్తమిత్రుడికే ఇచ్చి పెళ్లి చేశాడు మగమహారాజు. అదేదో సినిమా స్టోరీలో చూపించినట్లు చేశారని అనుకుంటున్నారేమో కానీ రియల్ లైఫ్ లో ఇది జరిగింది. తన ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోవాలని దాదాపుగా ఏడేళ్లుగా తన భార్యను బలవంత పెట్టి.. ఆమెకు విడాకులిచ్చి చివరకు 2013లో జియాంగ్ తన భార్య జుపింగ్ పెళ్లి చేశాడు. అంతకు ముందే ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఇక్కడ ఓ బలమైన కారణం ఉంది.
అదేమిటంటే.. చైనాలోని జువాన్ ప్రావిన్స్‌కు చెందిన జియాంగ్, జుపింగ్లకు 1996లో వివాహమైంది. అంతా సరిగ్గా నడుస్తోంది అనుకున్నప్పుడు.. 2006లో జరిగిన యాక్సిడెంట్ లో జియాంగ్ శరీరంలోని ఎడమ భాగం పక్షవాతానికి గురైంది. అతనికి నయమవడం కష్టమని వైద్యులు తేల్చేశారు. దీంతో తన భార్య అయినా సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో వేరే పెళ్లి చేసుకోమని ఆమెను బలవంతం చేశాడు. చివరకు ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేశాడు. అయినా కూడా ఆమె, జియాంగ్ స్నేహితుడు మాత్రం అతడిని వదల్లేదు. ఇప్పటికి జియాంగ్ ఆరోగ్యం బాగుపడాలని నానావిధాలుగా ప్రయత్నిస్తున్నారు.