హెల్మెట్ లేకుండా బైక్ నడిపి.. ఫైన్ కట్టిన ప్రధాని

అవును.. మీరు చదువుతున్నది నిజమే. ప్రభుత్వాన్ని నడిపే ప్రధానమంత్రి ఫైన్ కట్టాడు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే దానికి ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. దానిపై మారుమాట్లాడకుండా.. ఫైన్ కట్టేశాడు ప్రధాని. పైగా తనపై ఫైన్ వేసిన అధికార యంత్రాంగాన్ని మెచ్చుకున్నాడు కూడా. అలా ఎలా అంటారా..? తాను ఓ ప్రధానినే అయినా కానీ రూల్స్ విషయంలో మామూలు వ్యక్తిలాగా ట్రీట్ చేసినందుకు ప్రశంసించారు. పైగా వాహనదారులకు ఓ సలహా కూడా ఇచ్చారు ప్రధాని. ఆ ప్రధాని ఎవరంటే..

మన పిఎం నరేంద్ర మోదీ కాదులెండి. కాంబోడియాలో ప్రధాని హన్ సేన్ కు ఎదురైన ఘటన ఇది. ట్రాఫిక్ రూల్స్ కు అతిక్రమించి హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు ప్రధాని హన్ సేన్ కు షైన్ వేశారు అక్కడి అధికారులు. అయినా ఆయన ఏమనలేదు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు ఫైన్ కట్టారు. 15 వేల రియల్స్ చెల్లించారు. సరదా కోసమే ఆయన బైక్ నడిపినా పోలీసుల తీరును మెచ్చుకున్నాడాయన. మరోసారి అలాంటి తప్పు చేయనని చెప్పారు. ప్రజలెవరు హెల్మెట్ లేకుండా బైక్ నడపవద్దని సూచించారు.