నడిరోడ్డుపై అలా చేశారు.. ఎవరూ ఆపలేదు

పట్టపగలు..అందరూ చూస్తున్నారు.. ఓ యువకుడిని కొందరు దుండగులు కత్తులతో పొడిచారు. రక్తపు మడుగుల్లో ఆ యువకుడు..కొందరు ఈ ఘాతుకాన్ని తమ సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్నారు. కానీ ఏ ఒక్కరూ ఇతడిని కాపాడలేదు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన కర్నాటక జిల్లాలోని హసన్ జిల్లాలో చోటు చేసుకుంది.

బస్టాపులో యువతితో కలిసి ఉన్న ధనుష్ అనే యువకుడితో ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఆ తరువాత కత్తితో విచక్షణారహితంగా పొడిచేశారు. ఇదంతా చూస్తున్న వారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. యువతి ప్రేమ విషయంలో గతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. చివరిలో వచ్చిన పోలీసులు కూడా ప్రేక్షకపాత్ర పోషించారు. ఆ తరువాత రక్తపు మడుగులో ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించారు.