
మోదీ డిగ్రీ పట్టా వివాదం మీద ఇంకా రగడ నడుస్తూనే ఉంది. కేజ్రీవాల్ దీని మీద దేశవ్యాప్తంగా చర్చకు తెర తీశారు. ఆప్ నాయకులు రోజుకో ప్రకటన చేసి ఈ వివాదాన్ని మరింత పెంచారు. కాగా తాజాగా దీనిపై కేజ్రీవాల్ కు, ఇన్ఫర్మేషన్ కమీషనర్ మాడభూషి శ్రీధరాచార్యులకు గుజరాత్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గుజరాత్ విశ్వవిద్యాలయం పిటిషన్ పై కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది . మోడీ డిగ్రీకి సంబంధించిన వివరాలు వెల్లడించమని యూనివర్సిటీని ఎందుకు ఆర్డర్ చేశారని సీఐసీ ని హై కోర్టు ప్రశ్నించింది. ఆ అధికారం మీకు ఉందా ? అని కోరింది
కేజ్రీవాల్ ఇదివరకు ప్రధాని విద్యార్హతలపై డిల్లీ యూనివర్సిటీలో సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన సంగతి తెలిసిందే. అందుకు ఢిల్లీ, గుజరాత్ యూనివర్సిటీలు తిరస్కరించాయి. కేజ్రీవాల్ వేసిన ఆర్టీఐ పిటిషన్ ను పరిగణలోకి తీసుకొని.. పిటిషనర్ అడిగిన సమాచారాన్ని బయట పెట్టాలని ప్రధాన సమాచార కమిషనర్.. గుజరాత్, డిల్లీ యూనివర్సిటీలను ఆదేశించారు. దీనిపై స్పందించిన కోర్టు.. యూనివర్సిటీలు ఏమైనా పార్టీ ఆఫీసులు అనుకున్నారా? అని కేజ్రీవాల్ ను ప్రశ్నించింది గుజరాత్ హై కోర్టు. దీనిపై వివరణ ఇవ్వాలని సీఐసీని, కేజ్రీవాల్ ను ఆదేశించిన కోర్టు, విచారణను వచ్చేనెలకు వాయిదా వేసింది.