ఆశ్చర్యం.. రాందేవ్‌కు మోదీ ‘వెయ్యి’ గిఫ్ట్

ఏంటీ టైటిల్ చూసి షాకయ్యారా? రాందేవ్ బాబాకు నరేంద్ర మోదీ వెయ్యి రూపాయలు గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా..? అది నిజమే కానీ వెయ్యి  రూపాయలు కాదు. పతంజలి ట్రస్టు ద్వారా వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని సాగిస్తున్న రాందేవ్ బాబా, ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. ఆయన యోగా ఇంటర్నేషనల్ గా కూడా చాలా పాపులర్. ఓ రకంగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అంకురం వేసింది కూడా రాందేవ్ బాబానే. బిజెపి ప్రభుత్వానికి, పార్టీకి ముందు నుండి తన సపోర్ట్ ను అందిస్తున్నారు రాందేవ్ బాబా. మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీకి అండగా నిలిచారు. దాంతో మోదీ తన స్వామి భక్తిని నిరూపించుకునే టైం వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం. 

యోగాతో ఫేమస్ అయిన రాందేవ్ బాబాకు అదే యోగా కేంద్రం పేరుతో దాదాపుగా వెయ్యి ఎకరాల భూమిని గిఫ్ట్ గా ఇవ్వాలని మోదీ సర్కార్ చూస్తున్నట్లు సమాచారం. ఫరీదాబాద్ సమీపంలోని ఆరావళి పర్వతాల సానువుల్లో ఉన్న కోట్ గ్రామ సమీపంలో యోగా కేంద్రాన్ని ప్రారంభించేందుకు భారీ సహాయాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా దాదాపుగా 1000 ఎకరాల భూమిని రాందేవ్ బాబాకు గిఫ్ట్ గా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్లు 2012లో సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఆగిపోగా, చట్ట సవరణ ద్వారా రాందేవ్ కు భూమి ఇవ్వాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలా గతంలో తన వెంట నడిచిన రాందేవ్ బాబా లాంటి మిత్రుడికి సహాయం చేస్తే ఆపత్కాలంలో ఖచ్చితంగా అండగా నిలుస్తారని మోదీ ఆలోచన కావచ్చు అని రాజకీయ పండితులు అనుకుంటున్నారు.