జూన్ 21నే యోగా డేగా ఎందుకు తీసుకున్నారంటే..

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రపంచంవ్యాప్తంగా జరుగుతున్నాయి. 2014లో ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం తర్వాత 2015లో డిల్లీ లోని రాజ్ పత్ లో ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని లక్షల మందితో కలిసి యోగా చేశారు. ఈసారి కూడా ఐక్యరాజ్య సమితి ప్రపంచంలోని అన్ని దేశాలలో  అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని కోరింది. ప్రపంచంలోని రెండు మూడు దేశాలు మినహా మిగిలిన అన్ని దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఐక్యరాజ్య సమితి మొత్తం 191 దేశాలు యోగా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. 

ఛండీఘర్ లో ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన యోగా గురించి మాట్లాడారు. యోగా అనేది చనిపోయిన తర్వాత మీకు మోక్షం కలుగుతోంది అనుకోకూడదు అని, ఇక్కడ, ఇదే లోకంలో ఉండగా ప్రశాంతంగా ఎలా ఉండాలో నేర్పించేది యోగా అని అన్నారు. కాగా జూన్ 21నే అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఎందుకు తీసుకున్నామో తెలుసా..? అని వివరించారు. సంవత్సరంలో అతి పెద్ద రోజు (Longest Day in the Year) కాబట్టే ఈ రోజును మరింత స్పెషల్ గా చేస్తూ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని మోదీ  వివరించారు. దేశవ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలు జరుగుతున్నాయి.