భారత్ కి ఎన్ఎస్జీ మెంబర్ షిప్ అజెండాలో లేదు- చైనా

విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్, భారత్ కి ఎన్ఎస్జీ (న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్) లో సభ్యత్వం వచ్చినట్టే అని చెప్పిన ఒక్కరోజులోనే, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ మాట్లాడుతూ, సియోల్ సంఘపు సమావేశం ఎజెండాలో అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని, భారతదేశం ఎన్ఎస్జి లోకి ఎంటర్ అవడం లేదని స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ణయమైనా ప్రస్తుత పరిస్థితులలో, తగు చర్చలు జరిపిన తరువాతే తీసుకుంటామని తెలిపారు. 

రోజు గడవకముందే, తన స్టేట్మెంట్ ఇలా రివర్స్ అయిందని తెలిసిన విదేశాంగ మంత్రి, ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.