టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసి సజ్జనార్‌ ట్విట్టర్‌ అకౌంట్ హాక్...

January 24, 2023
img

టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసి సజ్జనార్‌ ట్విట్టర్‌ అకౌంట్ హాక్ కాగా ట్విట్టర్‌ సపోర్ట్ టీంకి ఫిర్యాదు చేయడంతో వారు మళ్ళీ అకౌంట్‌ని పునరుద్దరించారు. వీసి సజ్జనార్‌ అకౌంట్ ఎవరు హాక్ చేశారో తెలీదు కానీ డీపీలో బొమ్మని మార్చి, కొన్ని అనుచితమైన సందేశాలు పోస్ట్ చేశారు. అయితే ట్విట్టర్‌ సిబ్బంది వెంటనే స్పందించి అకౌంట్ పునరుద్దరించడంతో వాటిలో ఆ డీపీని, సందేశాలని తొలగించారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్‌, ఎంపీ రంజిత్ రెడ్డిల ట్విట్టర్‌ అకౌంట్లు కూడా హాక్ అయ్యింది. ఇటీవల ఏపీ డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి ట్విట్టర్‌ అకౌంట్ కూడా హాక్ అయ్యింది. ప్రముఖుల ట్విట్టర్‌ అకౌంట్స్ వరుసగా హాక్ అవుతుండటంపై సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అకౌంట్లని హాక్ చేస్తున్నవారి జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

టీఎస్‌ఆర్టీసీ సొంతంగా ‘జీవా’ పేరుతో త్రాగునీళ్ళ బాటిల్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ముందుగా హైదరాబాద్‌లో అన్ని టీఎస్‌ఆర్టీసీ బస్టాండ్స్‌లో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్టాండ్స్‌లో ‘జీవా వాటర్’ బాటిల్స్‌ని అందుబాటులోకి తీసుకురాబోతోంది.

 


Related Post