ఇస్రో చిన్నోడు కనబడుటలేదు

August 08, 2022
img

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రోకు నిన్న పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు ఇస్రో భారీ ఉపగ్రహవాహక నౌక (పిఎస్‌ఎల్‌వి)తో దేశవిదేశాలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలో నిర్ధిష్ట కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెడుతోంది. కానీ అంతరిక్ష ప్రయోగాల ఖర్చు తగ్గించుకోగలిగితే అంతరిక్ష వ్యాపారంలో మరింత పట్టు సాధించవచ్చనే ఆలోచనతో ఇస్రో తక్కువ బరువు కలిగిన ఉపగ్రహవాహక నౌక (పిఎస్‌ఎల్‌వి)ని తయారుచేసి దాంతో ఆదివారం రెండు ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది.

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి నిన్న ఉదయం 9.18 గంటలకు పిఎస్‌ఎల్‌వి-డి1 నిప్పులు విరజిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. మొదటి మూడు దశలు ఘన ఇందనం, నాలుగో దశ ద్రవ ఇందనంతో నిర్ధిష్ట కక్ష్య చేరుకొనేలా పిఎస్‌ఎల్‌విని డిజైన్ చేశారు. మొదటి రెండు దశలలో అంతా సవ్యంగా సాగింది. మూడో దశలో సుమారు రెండున్నర నిమిషాల తర్వాత పైకి దూసుకు వెళ్లవలసిన పిఎస్‌ఎల్‌వి గతి తప్పి కిందకు ప్రయాణిస్తూ రెండు ఉపగ్రహాలను విడిచిపెట్టేసి అంతరిక్షంలో మాయం అయ్యింది. తర్వాత రెండు ఉపగ్రహాలు కూడా గతి తప్పి వివిద దేశాలలోని అంతరిక్ష కేంద్రాలతో కనెక్షన్ కోల్పోయాయి. ఈ పిఎస్‌ఎల్‌వి జూనియర్‌పై పూర్తినమ్మకంగా ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగం విఫలమవడంతో తీవ్ర నిరాశ చెందారు.

ఈ ప్రయోగం విఫలం అయినట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్ ప్రకటించారు. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతం అయ్యుంటే, ఇస్రో అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే ఏకైక సంస్థగా నిలిచి, భారత్‌కు భారీగా ఆదాయం సమకూర్చిపెట్టి ఉండేది. 

Related Post