త్వరలో మాదాపూర్‌లో టీ హబ్‌-2 ప్రారంభోత్సవం

June 22, 2022
img

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీ-హబ్‌లతో అనేక స్టార్టప్ కంపెనీలు ఆవిర్భవించి విజయవంతంగా నడిచేందుకు దోహదపడుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారిగా 2015లో గచ్చిబౌలి ట్రిపుల్ ఐ‌టి క్యాంపస్‌లో ప్రయోగాత్మకంగా టెక్నాలజీ హబ్‌ పేరుతో తొలి టీ-హబ్‌ ఏర్పాటు చేయగా దాంతో 1,800 స్టార్టప్ కంపెనీలు ఆవిర్భవించాయి.

ఈ టీ-హబ్‌ ప్రయోగం విజయవంతం అవడంతో రాష్ట్రంలో వరంగల్‌, ఖమ్మం తదితర పలు జిల్లాలలో టీ-హబ్‌లు ఏర్పాటు చేయగా వాటి ద్వారా కూడా అనేక స్టార్టప్ కంపెనీలు ఆవిర్భవించి విజయవంతంగా నడుస్తున్నాయి.  ఇప్పుడు మాదాపూర్ రాయదురాగమ్ నాలెడ్జ్ సిటీలో సుమారు 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద టీ-హబ్‌ ఏర్పాటు చేసింది.

దీని నిర్మాణ కార్యక్రమాలన్నీ పూర్తవడంతో ఈనెల 28వ తేదీన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ దీనికి ప్రారంభోత్సవం చేయనున్నారు. అత్యాధునిక సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ టీ-హబ్‌లో ఒకేసారి 2,000 స్టార్టప్ కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. 

Related Post