ఆ ఆధార్ కార్డులు వాడొద్దు: యుఐడీఏఐ

January 21, 2022
img

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) దేశ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేసింది. తాము జారీ చేసిన ఆధార్ కార్డులు తప్ప మార్కెట్లో తయారుచేస్తున్న పాకెట్ సైజ్ పీవీసీ ఆధార్ కార్డులను వినియోగించవద్దని కోరింది. వాటిలో ఎటువంటి భద్రత (సెక్యూరిటీ ఫీచర్) ఉండదని కనుక వాటిని వినియోగించవద్దని కోరింది. ఆన్‌లైన్‌లో రూ.50 చెల్లించిన్నట్లయితే మీ ఫోటోగ్రాఫ్, డెమోగ్రాఫ్, క్యూఆర్ కోడ్ తదితర భద్రత ఫీచర్స్ కలిగిన పాకెట్ సైజ్ పీవీసీ ఒరిజినల్ ఆధార్ కార్డును యుఐడీఏఐ ద్వారా పొందవచ్చని తెలిపింది. ఈ కార్డును ఫాస్ట్ పోస్ట్ ద్వారా నేరుగా ఇంటికే పంపిస్తామని తెలిపింది.

దీని కోసం ఏవిదంగా దరఖాస్తు చేసుకోవాలంటే...

యుఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ https://myaadhaar.uidai.gov.in/ ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి.

తరువాత ‘ఆర్డర్ ది పీవీసీ కార్డు’ పై క్లిక్ చేయాలి.

అక్కడ మీ వివరాలు నమోదు చేసి ఆన్‌లైన్‌లో రూ.50 చెల్లిస్తే పాకెట్ సైజ్ పీవీసీ ఒరిజినల్ ఆధార్ కార్డు మీరు పేర్కొన్న చిరునామాకి ఫాస్ట్ పోస్ట్ ద్వారా వస్తుంది. 

Related Post