భారత్ మహిళా రెజ్లర్ వినేష్ ఫొగెట్ పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50కేజీల విభాగంలో అద్భుతం చేసింది. నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన జపాన్ దేశానికి చెందిన సుసాకిని ప్రీక్వార్టర్స్‌లోనే ఓడించింది.
వ్యక్తిగత కారణాల వలన ఏడాదిన్నరపాటు రెజ్లింగ్‌కు దూరమైన వినేష్ ఫొగెట్‌పై ఎటువంటి అంచనాలు లేవు. పైగా సుసాకి ధాటికి తట్టుకోలేక మొదటి నుంచి ఆత్మరక్షణకే పోరాడవలసి వచ్చింది. కనుక ఆమె చేతిలోనే ఓడిపోయి తిరిగి వస్తుందనుకుంటే, కానీ అదే వినేష్ ఫొగెట్ వ్యూహామని చివరికి అందరికీ అర్దమైంది. సుసాకితో పోరాడి తాను గెలవలేననే భ్రమింపజేస్తూ చాలా తెలివిగా సుసాకిని చివరి క్షణంలో బోర్లా కొట్టించిందని చెప్పవచ్చు.
ఆట ముగిసేందుకు మరో 20 సెకన్ల సమయం మాత్రమే మిగిలి ఉన్నప్పుడు వినేష్ ఫొగెట్ హటాత్తుగా ఎదురుదాడి చేసి సుసాకిని రింగ్ బయటకు త్రోసేసి ఆమెను కదలకుండా పట్టి ఉంచి మూడు పాయింట్లు సాధించి3-2 పాయింట్లతో విజయం సాధించిఓంది.
ప్రపంచ విజేతని ఓడించడంతో పెరిగిన ఆత్మవిశ్వాసం, వచ్చిన ఉత్సాహం వలన ఆమె ముందు ఒక్సానా లివాచ్ (ఉక్రెయిన్)ని 5-4 పాయింట్లతో ఓడించి ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. భారత్ కాలమాన ప్రకారం బుధవారం రాత్రి 11 గంటలకు అమెరికా రెజ్లర్ సారా హిల్డేబ్రాంట్‌ని వినేష్ ఫొగెట్ ఢీకొనబోతోంది.
ఒకవేళ ఆమెను కూడా ఓడించగలిగితే ఎన్నో అవమానాలు, వేధింపులు, దౌర్జన్యాలకు గురైన వినేష్ ఫొగెట్ భారత్‌కు స్వర్ణ పతకం అందించబోతోంది. ఒకవేళ ఓడినా భారత్‌కు ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి ఇవ్వబోతోంది.