పారిస్ ఒలింపిక్స్‌లో అత్యద్భుతంగా ఆడుతున్న భారత్ హాకీ టీమ్ నిన్న జరిగిన సెమీ ఫైనల్స్‌లో కూడా జర్మనీతో హోరాహోరీగా పోరాడింది. కానీ 2-3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. దీంతో భారత్ జట్టు కాంస్య పతకం కోసం స్పెయిన్‌తో పొరాడిగెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారత్ జట్టు మొదట చాలా దూకుడుగా ఆడుతూ ఓ గోల్ చేసింది. దాంతో జర్మనీ జట్టుపై ఒత్తిడి పెరిగింది. కానీ జర్మనీ జట్టు కూడా చురుకుగా కదులుతూ వరుసగా రెండు గోల్స్ చేసింది. అప్పుడు భారత్ జట్టు పెనాల్టీ కార్నార్ షాట్‌తో గోల్ చేసి 2-2తో సమానం చేసింది. దీంతో మ్యాచ్ చాలా ఉత్కంఠగా మారింది. అప్పటి నుంచే జర్మనీ జట్టు మైదానంలో చెలరేగిపోతూ పదేపదే భారత్ గోల్ పోస్టు వైపు దూసుకుపోతూ భారత్ జట్టుకి చుక్కలు చూపించింది.
మరో ఆరు నిమిషాలలో మ్యాచ్ ముగుస్తుందనగా జర్మనీ జట్టు ఫీల్డ్ గోల్ చేసి 3-2తో భారత్‌పై విజయం సాధించింది. ఈసారి ఒలింపిక్స్‌లో తప్పకుండా గెలిచి బంగారు పతకంతో తిరిగి వస్తుందనుకున్న భారత్ హాకీ జట్టు కాంస్య పతకం కోసం స్పెయిన్‌తో పోరాడాల్సి వస్తోంది. కానీ హాకీలో స్పెయిన్ జట్టుకి తిరుగులేదు. కనుక భారత్ హాకీ జట్టు దానిని ఓడించగలదా? ఓడించి కాంస్య పతకం సాధిస్తుందా లేదా? తెలియాలంటే గురువారం రాత్రి జరిగే ఫైనల్స్‌లో తెలుస్తుంది.