భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా ‘జావలిన్ త్రో’ క్వాలిఫయింగ్ రౌండ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఫైనల్స్ చేరాడు. క్వాలిఫైయింగ్ అవడానికి కనీసం 84 మీటర్లు కాగా నీరజ్ చోప్రా 89.34 అడుగులు దూరం బల్లెం విసిరి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. అతని తర్వాత గ్రెనెడా దేశానికి చెందిన ఏ పీటర్స్ 88.63 మీటర్లు, పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 86.59 మీటర్ల దూరం బల్లెం విసిరి రెండు మూడు స్థానాలలో నిలిచారు.
గ్రూప్-ఏలో ఒడిశాకు చెందిన మరో జావలిన్ ప్లేయర్ కిషోర్ కుమార్ క్వాలిఫయింగ్ రౌండ్‌లోనే అర్హత సాధించలేక వెనుతిరుగుతున్నాడు.
నీరజ్ కుమార్‌తో కలిపి మొత్తం 12 మంది ఫైనల్స్‌కు అర్హత సాధించారు. గురువారం జావ్లీన్ త్రో ఫైనల్స్ జరుగనున్నాయి. క్వాలిఫయింగ్ రౌండ్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన నీరజ్ చోప్రా ఇదే ఊపుతో ఫైనల్స్‌లో కూడా విజయం సాధించి భారత్‌కు తప్పకుండా బంగారు పతకం సాధిస్తాడని అందరూ ఆశపెట్టుకున్నారు.