సెమీ ఫైనల్స్ ప్రవేశించిన భారత్‌ హాకీ టీమ్‌

August 04, 2024
img

 ప్రస్తుతం పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్‌ హాకీ టీమ్‌ బ్రిటన్ జట్టుని ఓడించి సెమీ ఫైనల్స్ ప్రవేశించింది. ఈరోజు (అదివారం) భారత్‌-బ్రిటన్ జట్లు క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడగా చివరివరకు రెండు జట్లు హోరాహోరీగా ఆడటంతో 1-1 గోల్స్ సాధించి సమ ఉజ్జీలుగా నిలబడ్డాయి. 

మొదటి క్వార్టర్‌లో రెండు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. రెండో క్వార్టర్‌లో 22వ నిమిషంలో భారత్‌ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్‌ ఒక గోల్ చేయగా, మరో 5 నిమిషాలకు బ్రిటన్ ప్లేయర్ మోర్టన్ లీ కూడా ఓ గోల్ చేయడంతో రెండు జట్లు సరిసమానం అయ్యాయి. 

మ్యాచ్ టై అవడంతో విజేత జట్టుని నిర్ణయించేందుకు ఇరు జట్లకు షూట్ అవుట్ (పెనాల్టీ షాట్స్) ఆడించగా రాజ్‌కుమార్‌ పాల్ కొట్టిన పెనాల్టీ షాట్‌తో 4-2 తేడాతో బ్రిటన్‌ని ఓడించి భారత్‌ సెమీ ఫైనల్స్‌లో ప్రవేశించింది. 

Related Post