పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు నేడు మూడో పతకం లభించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ (క్రింద బోర్లా పడుకొని, మోకాలిపై కూర్చొని, నిలబడి) ఫైనల్ ఈవెంట్‌లో భారత్ యువ షూటర్ స్వప్నిల్ కుశాలే కాంస్య పతకం సాధించాడు.
స్వప్నిల్ మొదట కాస్త తడబడినా టాప్-3లోకి వచ్చిన తర్వాత దూసుకుపోయి 3వ స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్‌లో చైనా షూటర్ లీ యుకున్ 463.6 పాయింట్లు సాధించి బంగారు పతకం అందుకోగా, ఉక్రెయిన్ దేశానికి చెందిన కులిష్ సెర్హియ్ 461.3 పాయింట్లతో రజతం, భారత్‌కు చెందిన స్వప్నిల్ 451.4 పాయింట్స్ సాధించి కాంస్య పతకం అందుకున్నాడు.
భారత్ షూటర్స్ మనూ భాకర్, సరబ్ జ్యోత్ సింగ్ పిస్టల్ ఈవెంట్‌లో ఇప్పటికే రెండు పతకాలు సాధించారు. దీంతో కలిపి భారత్ ఇప్పటి వరకు మూడు పతకాలు సాధించింది.