భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధూ పారిస్ పారిస్ ఒలింపిక్స్‌లో దూసుకుపోతున్నారు. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లలో వరుసగా రెండు గేమ్స్ 21-5,21-10తో గెలిచారు. ఎస్తోనియాకు చెందిన షట్లర్ క్రీస్టినా కుబా మొదటి మ్యాచ్‌లో సింధూకి అసలు పోటీ ఇవ్వలేకపోవడంతో చాలా వేగంగా గేమ్ ముగించగలిగారు.
రెండో మ్యాచ్‌లో ఆమె గట్టి పోటీ ఇచ్చారు కానీ పీవీ సింధూ ధాటికి నిలువలేకపోయారు. రెండో గేమ్ 35 నిమిషాలలో పూర్తయింది. దీంతో సింధూ 16వ రౌండ్- ప్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.
భారత్ షూటర్ స్వప్నిల్ కుశాల్ 50 మీటర్ల 3 పొజిషన్ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరాడు. ఫైనల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఏదో స్థానం సంపాదించాడు. భారతీయ కాలమాన ప్రకారం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఫైనల్ జరుగుతుంది.