నా వయసు అయిపోయింది... కెరీర్‌ కూడా ముగుస్తోంది: ధోని

April 22, 2023
img

మహేంద్ర సింగ్‌ ధోని... ఆ పేరే ఒకప్పుడు క్రికెట్ అభిమానులకు హైవోల్టేజ్ కరెంటులా వినిపించేది. కానీ ఇప్పుడు నా వయసు అయిపోయిందని, కెరీర్‌ కూడా చివరిదశలో ఉందని స్వయంగా ధోనీయే చెప్పుకోవడం ఆయన అభిమానులకు చాలా బాధ కలిగించే విషయమే. కానీ ఇది వాస్తవం కనుక జీర్ణించుకోక తప్పదు.

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌ని ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కొంగ్స్ టీమ్‌ చిత్తుగా ఓడించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పటికే చాలామంది నేను ఇంకా ఎంతకాలం ఆడుతానంటూ నా కెరీర్‌ గురించి మాట్లాడుతున్నారు. నాకు వయసు అయిపోతోందని, నా కెరీర్‌ ముగింపు దశకు చేరుకొందని చెప్పుకోవడానికి నేనేమీ సిగ్గుపడను. సచిన్ టెండూల్కర్ 17 ఏళ్ళ వయసులో బ్యాట్ పట్టుకొని 25 ఏళ్లపాటు అందరినీ అలరించాడు. నేను కూడా క్రికెట్ అభిమానులను అలరించాననే భావిస్తున్నాను. రెండేళ్ళ తర్వాత నేను ఈ మ్యాచ్‌ ఆడటం, దీనిని చూసి అభిమానులు ఆనందించడం నాకు చాలా సంతృప్తినిచ్చాయి. ఈ మ్యాచ్‌లో అలాగే ఇన్నేళ్ళుగా నన్ను ఆదరించి ప్రేమను పంచిన క్రికెట్ అభిమానులు అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు.


Related Post