రాజస్థాన్‌లో ఓ మారుమూల గ్రామంలో ముమల్ మెహర్ అనే ఓ మైనర్ బాలిక బ్యాటింగ్ చేస్తున్న తీరు చూసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎంతో ముగ్దుడైపోయారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, నిన్ననే కదా ఆటగాళ్ళ వేలంపాట జరిగింది అపుడే మ్యాచ్ మొదలైపోయిందా? భలే బ్యాటింగ్ చేస్తోంది ఈ అమ్మాయి. ఆమె బ్యాటింగ్‌ని నేను చాలా ఎంజాయ్ చేశాను,” అంటూ ఆమెని మెచ్చుకొన్నారు.
సచిన్ టెండూల్కర్ ఆమె బ్యాటింగ్‌ని మెచ్చుకొంటూ పోస్ట్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ అమ్మాయి బ్యాటింగ్ స్టైల్ చూస్తే క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ గుర్తొస్తున్నాడని పొగుడుతున్నారు. ఆమెకి సరైన శిక్షణ ఇప్పించాలని చాలా మంది రాజస్థాన్‌ల ముఖ్యమంత్రికి ఆ వీడియోని పంపిస్తున్నారు.
ముమల్ మెహర్ బ్యాటింగ్‌ని సచిన్ టెండూల్కర్ అంతటివాడు మెచ్చుకొన్నారంటే ఆమె బ్యాటింగ్ మనమూ ఓ ఫస్ట్-లుక్ వేయాల్సిందే. ఇదిగో... ఆ వీడియో... మీరు చూసి ఆనందించండి.
Kal hi toh auction hua.. aur aaj match bhi shuru? Kya baat hai. Really enjoyed your batting. 🏏👧🏼#CricketTwitter #WPL @wplt20
— Sachin Tendulkar (@sachin_rt) February 14, 2023
(Via Whatsapp) pic.twitter.com/pxWcj1I6t6