భారత్‌-ఆస్ట్రేలియా మూడో టెస్ట్ మ్యాచ్ వేదిక మారింది

February 13, 2023
img

భారత్‌-ఆస్ట్రేలియా మద్య బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ మూడో టెస్ట్ మ్యాచ్‌ వేదిక మారింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఈ మ్యాచ్ జరుగవలసి ఉండగా, అవుట్ ఫీల్డ్ ఇంకా సిద్దం కాకపోవడంతో ఈ మ్యాచ్‌ని మధ్యప్రదేశ్, ఇండోర్ నగరంలో హోల్కర్ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించిన్నట్లు బిసిసి‌ఐ‌ ప్రకటించింది. తమ క్యూరేటర్ తపోష్ చటర్జీ స్వయంగా ధర్మశాలకి వెళ్ళి హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌ అధ్వర్యంలో నిర్వహింపబడుతున్న స్టేడియంని పరిశీలించిన తర్వాత మ్యాచ్‌కి సిద్దంగా లేదని నివేదిక ఇచ్చారని అందువల్లే మ్యాచ్‌ని ఇండోర్‌కి మార్చవలసి వచ్చిందని బిసిసి‌ఐ‌ తెలియజేసింది. 

 బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. దానిలో భారత్‌ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్‌ ఫిభ్రవరి 17 నుంచి ఢిల్లీలో జరుగనుంది. అది పూర్తయిన తర్వాత మార్చి 1వ తేదీ నుంచి ఇండోర్‌, హోల్కర్ స్టేడియంలో జరుగుతుంది. 

Related Post