హైదరాబాద్‌లో ఘనంగా ముగిసిన ఫార్ములా ఈ-రేసింగ్

February 11, 2023
img

శనివారం మధ్యాహ్నం 3 గంటలకి హైదరాబాద్‌ హుస్సేన్ సాగర్ వద్ద జరిగిన ఫార్ములా ఈ-రేసింగ్ పోటీ ఊహించిన దానికంటే ఎంతో ఘనంగా, అట్టహాసంగా జరిగాయి. హైదరాబాద్‌లో తొలిసారిగా జరిగిన ఈ ఫార్ములా ఈ-రేసింగ్ చూసేందుకు దేశం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు, భారీగా ప్రజలు తరలివచ్చి పోటీలని ఆస్వాదించారు. గంటకి 300 కిమీ పైగా వేగంతో దూసుకుపోతున్న రేసింగ్ కార్లని చూసి అందరూ ఊపిరి ఉగ్గబట్టుకొని మరీ చూసి ఆనందించారు. సుమారు గంటన్నరసేపు ఫార్ములా ఈ-రేసింగ్ కొనసాగింది. 

‘డీఎస్ పెన్‌స్కే’ టీమ్‌లో తరపున పోటీలో పాల్గొన్న ఫ్రాన్స్ దేశానికి చెందిన జీన్ ఎరిక్ వెర్గనే వరల్డ్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలించాడు. జీన్ ఎరిక్ ఇప్పటికే రెండుసార్లు ఫార్ములా ఈ-రేసింగ్ ఛాంపియన్‌గా ఉన్నాడు. ఇప్పుడు మూడోసారి కూడా గెలిచి నిజమైన ప్రపంచ ఛాంపియన్‌ తానేనని నిరూపించుకొన్నాడు. 

ఎన్‌విజన్ రేసింగ్ టీమ్‌ తరపున పోటీలో పాల్గొన్న న్యూజిలాండ్ దేశానికి చెందిన నిక్ క్యాసిడీ రెండో స్థానంలో, ఎన్‌విజన్ రేసింగ్ టీమ్‌ తరపున పోటీలో పాల్గొన్న స్వీడన్ దేశస్థుడైన సెబాస్టియన్ బ్యూమి మూడో స్థానంలో నిలిచారు. 

ఈ ఒకే ఒక్క ఫార్ములా ఈ-రేసింగ్ నిర్వహణతో యావత్ దేశ ప్రజలు హైదరాబాద్‌ వంక చూసేలా చేసింది తెలంగాణ ప్రభుత్వం. వీటిని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఎంతో కృషి చేసిన ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌కె ఈ క్రెడిట్‌ సొంతం అని చెప్పవచ్చు. 

   

          

Related Post