కామన్ వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధు స్వర్ణం

August 08, 2022
img

ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ లో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్‌ షట్లర్, మన తెలుగమ్మాయి పీవీ సింధు ఈరోజు స్వర్ణం సాధించింది. మహిళల సింగిల్స్ విభాగంలో కెనడాకు చెందిన మిచెలీ లీని తొలి గేమ్‌లో 21-15తో పీవీ సింధు నెగ్గింది. రెండో రౌండులో 21-13తో ఓడించి భారత్‌ ఖాతాలో మరో స్వర్ణ పతకం జోడించింది. దీంతో ఈసారి కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 19 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలతో కలిపి మొత్తం 56 పతకాలువచ్చాయి.

పీవీ సింధు 2014 కామన్ వెల్త్ గేమ్స్‌లో కాంస్యం, 2018లో రజతం సాధించగా ఈసారి స్వర్ణం సాధించి తన సత్తా మరోసారి చాటుకొంది. ఇవికాక 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2021 ఒలింపిక్స్‌లో కాంస్యం, 2018 ఆసియా గేమ్స్‌లో రజతం సాధించింది.       


Related Post