భారత్‌ మహిళా క్రికెట్‌ కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్

June 08, 2022
img

భారత్‌ మహిళా క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ఈరోజు రిటైర్మెంట్ ప్రకటించడంతో బీసీసీఐ ఆమె స్థానంలో సీనియర్ ప్లేయర్   హర్మన్ ప్రీత్ కౌర్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఆమె నేతృత్వంలో ఈ నెల 23వ తేదీ నుంచి శ్రీలంకతో జరుగబోయే వన్డే, టీ20 జట్టులను కూడా బీసీసీఐ ప్రకటించింది. జూన్‌ 23,25,27 తేదీలలో భారత్‌ మహిళా జట్టు శ్రీలంక జట్టుతో దంబుల్లాలో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడబోతోంది. వాటి తరువాత జూలై 1, 4, 7 తేదీలలో క్యాండీలో మూడు వన్డేలు భారత్‌ జట్టు ఆడుతుంది.  

టీ20 జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మందాన (వైస్ కెప్టెన్‌), షఫాలి వర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), మేఘనా సింగ్, దీప్తి శర్మా, పూనం యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్ (కీపర్), పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్, రోడ్రిగ్స్, రాధా మాధవ్.

వన్డే జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మందాన (వైస్ కెప్టెన్‌), షఫాలి వర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), మేఘనా సింగ్, దీప్తి శర్మ, పూనం యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్, తానియా భాటియా, హర్లీన్ డియోల్. 

Related Post