ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ షేన్ వార్న్ హటాన్మరణం

March 05, 2022
img

ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ షేన్ వార్న్(52) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈవిషాద వార్త ఆయన మేనేజర్ మైకేల్ కోహెన్ మీడియాకు తెలిపారు. షేన్ వార్న్ థాయ్‌లాండ్‌లోని కోహ్ సమూయ్ అనే ప్రాంతంలో తన ప్రైవేట్ విల్లాలో ఉన్నప్పుడు గుండెపోటుతో చనిపోయారని వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారని తెలిపారు. 

కొన్ని గంటల ముందు ఆస్ట్రేలియా క్రికెటర్ రోనీ మార్ష్ (74) చనిపోగా, ఆయన మృతికి సంతాపం తెలుపుతూ షేన్ వార్న్ ట్వీట్ చేశారు. తరువాత షేన్ వార్న్ చనిపోయారనే వార్త విని యావత్ క్రికెట్ ప్రపంచం షాక్ అయ్యింది. ప్రపంచ క్రికెట్‌ను దశాబ్దాన్నర కాలంపాటు తన స్పిన్ బౌలింగ్‌తో శాశిస్తూ ఆస్ట్రేలియాకు తిరుగులేని విజయాలు అందించిన షేన్ వార్న్ హటాన్మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆయనతో అనుబందం పెనవేసుకొన్న ఆస్ట్రేలియా ఆటగాళ్ళు, ఆస్ట్రేలియా ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భారత్‌తో సహా వివిద దేశాల క్రికెట్‌ జట్లలో ఆయన స్పిన్ బౌలింగ్ ధాటిని తట్టుకోలేక విలవిలలాడిన అనేక మంది దిగ్గజ బ్యాట్స్ మెన్ షేన్ వార్న్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

షేన్ వార్న్ అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్ అయిన తరువాత కామెంటేటర్‌గా క్రికెట్‌ ప్రియులను ఆకట్టుకొంటున్నారు. ఆయనకు భార్య సిమోన్, ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు ఉన్నారు. కొంతకాలం క్రితమే ఆయన భార్య నుంచి విడిపోయారు. షేన్ వార్న్ ఆస్ట్రలియా తరపున 145 టెస్టులు ఆది 708 వికెట్లు తీశారు. 194 వన్డేలు ఆది 293 వికెట్లు తీశారు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ప్రపంచంలో రెండో వాడిగా షేన్ వార్న్ నిలిచారు.

Related Post