ఫిబ్రవరి 24 నుంచి భారత్‌-శ్రీలంక టీ20 సిరీస్

February 17, 2022
img

వెస్టిండీస్‌తో మూడు టీ-20 మ్యాచ్‌లు ముగిసిన తరువాత భారత్‌ జట్టు శ్రీలంక జట్టుతో ఆడనుంది. ఈ నేపథ్యంలో  భారత్, శ్రీలంక మధ్య ద్వైపాక్షిక సిరీస్ షెడ్యూల్లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు టీ-20 సిరీస్, ఆ తర్వాత రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి టీ-20 మ్యాచ్‌ లక్నోలో జరుగుతుంది. రెండు, మూడవ టీ-20 మ్యాచ్‌లు ధర్మశాలలో జరగనున్నాయి. అలాగే మొదటి టెస్ట్ మ్యాచ్ మొహాలీలో, రెండో టెస్ట్ మ్యాచ్  (డే అండ్ నైట్) బెంగళూరులో జరగనుంది. ఇంతకు ముందు మొదట టెస్ట్ మ్యాచ్‌లు, తర్వాత టీ-20 మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ భావించింది. కానీ పలువురు విజ్ఞప్తి చేయడంతో బీసీసీఐ షెడ్యూల్లో సల్ప మార్పులు చేసింది. 


Related Post