తొలి టి-20 మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం

February 17, 2022
img

బుధవారం రాత్రి కోల్‌కతాలో ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన మొదటి టీ-20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో భారత్ టీ-20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. అంతకుముందు భారత్ టాస్ గెలిచి విండీస్‌కు బ్యాటింగ్ అప్పగించింది. భారత బౌలర్లు టీ-20 లో కూడా విజృంభించడంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. నికోలస్ పూరన్ 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ చెరో రెండేసి వికెట్లు పడ్డాయి. 

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు శుభారంభం అందించారు. ఒక దశలో పరుగుల లక్ష్యాన్ని 15 ఓవర్లలోనే పూర్తి చేస్తారా...అనిపించింది. కానీ వెంటవెంటనే రెండు వికెట్లు పడడంతో విజయం ఆలస్యమైంది. భారత్ 18.5 ఓవర్లలో 162 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. విజయాన్ని ఛేదించే క్రమంలో నాలుగు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ 40, సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో రవి బిష్ణోయ్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

మళ్ళీ ఇరుజట్ల మధ్య రెండో టీ-20 మ్యాచ్ రేపు(శుక్రవారం) రాత్రి  7:30 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లోనే జరగనున్నది.

Related Post