రేపటి నుంచి కోల్‌కతాలో ఇండియా-వెస్ట్ ఇండీస్ టి20 సిరీస్

February 15, 2022
img

బుధవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ వర్సెస్ వెస్టిండీస్ మొదటి టీ-20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్  రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే భారత్ మూడు వన్డేలలో గెలిచి పేటీఎం సిరీస్ సొంతం చేసుకుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ టీ-20 సిరీస్ కూడా గెలుచుకొని తమ సత్తా చాటుకోవాలని భారత్‌ జట్టు క్రికెటర్లు కఠినంగా శ్రమిస్తుండగా, కనీసం ఈ టి-20 లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని విండీస్ క్రికెటర్లు ఆరాటపడుతున్నారు.ఈ మ్యాచ్‌లలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. 

భారత జట్టు(అంచనా): రోహిత్ శర్మ, రిషబ్ పంత్, ఋతురాజ్ గైక్వాడ్, మహమ్మద్ సిరాజ్, విరాట్ కోహ్లీ, శార్దుల్ ఠాకూర్, యాజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్. 

వెస్టిండీస్ జట్టు (అంచనా): బ్రాండెన్ కింగ్, డారెన్ బ్రావో, రువ న్ పావెల్, పాబదిన్ ఫాలోస్, నికోలస్ పూరన్, రోస్టన్ చేస్, డొమినిక్ డ్రీక్స్, ఒడిన్ స్మిత్, కేరన్ పోలార్డ్, జాసన్ హోల్డర్, కెల్స్ మీమర్స్. 

Related Post