టి20 ప్రపంచ కప్ మ్యాచ్‌ షెడ్యూల్

January 21, 2022
img

టి20 ప్రపంచ కప్ మ్యాచ్‌ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి నవంబర్‌ 13వరకు ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్-2లో భారత్‌, పాకిస్థాన్‌, బాంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. భారత్‌-పాక్‌ జట్ల మద్య అక్టోబర్ 23వ తేదీన తొలిపోరు జరుగనుంది. నవంబర్‌ 9న తొలి సెమీ ఫైనల్స్, మర్నాడు అంటే నవంబర్‌ 10వ తేదీన రెండో సెమీ ఫైనల్స్, నవంబర్‌ 13వ తేదీన మెల్‌బోర్న్ లో ఫైనల్ మ్యాచ్ జరుగుతాయి.  

టి20 ప్రపంచ కప్ మ్యాచ్‌ షెడ్యూల్  కొరకు https://www.t20worldcup.com/fixtures సందర్శించవచ్చు. గత ఏడాది జరిగిన టి20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌ చేతిలో భారత్‌ జట్టు ఓడిపోయింది. కనుక ఈసారి భారత్‌ జట్టు ఎంతవరకు వెళుతుందో, టి20 ప్రపంచ కప్ సాధించగలదో లేదో చూడాలి.  

Related Post