భారత్‌-పాక్‌ జట్లు మరోసారి మ్యాచ్‌?

November 19, 2021
img

భారత్‌-పాక్‌ క్రీడాభిమానులకు రెండు జట్ల మద్య క్రికెట్ మ్యాచ్‌ అంటే అది ప్రపంచ కప్ మ్యాచ్‌ కంటే గొప్ప మ్యాచ్‌గా భావిస్తుంటారు. కానీ ఇరుదేశాల మద్య సత్సంబందాలు లేకపోవడంతో ఇదివరకులా నేరుగా రెండు దేశాల జట్ల మద్య మ్యాచ్‌లు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఇది క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగించేదే అని చెప్పవచ్చు. అయితే వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో శ్రీలంకలో జరుగబోయే (టి20 ఫార్మాట్) ఆసియా కప్‌లో మళ్ళీ ఆస్ట్రేలియాలో జరుగబోయే టి20 ప్రపంచ కప్‌ టోర్నీలో భారత్‌, పాక్‌ జట్లు పాల్గొంటాయి కనుక మళ్ళీ అప్పుడు ఇరు జట్ల మద్య మ్యాచ్‌లు జరుగుతాయి. కనుక క్రికెట్‌ అభిమానులు అంతవరకు వేచి చూడక తప్పదు.        


Related Post