ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా సౌరభ్ గంగూలీ

November 18, 2021
img

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కమిటీకి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్న అనిల్ కుంబ్లే గత 7 ఏళ్ళుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఐసీసీ నిబందనల ప్రకారం మూడుసార్లు కంటే ఎక్కువ పదవిలో కొనసాగరాదు. కనుక ఆయన స్థానంలో సౌరభ్ గంగూలీని నియమిస్తున్నట్లు ఐసీసీ పాలకవర్గం ప్రకటించింది.    


Related Post