టి-20 ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియా

November 15, 2021
img

దుబాయ్‌లో ఆదివారం రాత్రి జరిగిన న్యూజిల్యాండ్‌- ఆస్ట్రేలియా జట్ల మద్య జరిగిన టి-20 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి ప్రపంచ కప్‌ సొంతం చేసుకొంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిల్యాండ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు ఇది భారీ లక్ష్యమే కానీ 18.5 ఓవర్లలోనే 173 రన్స్ చేసి విజయం సాధించింది. అయితే మ్యాచ్ చివరి రెండు ఓవర్లు చాలా గొప్పగా సాగింది. ఆస్ట్రేలియా 18 ఓవర్లకు రెండు వికెట్స్ కోల్పోయీ 162 పరుగులు మాత్రమే చేసింది. కనుక మిగిలిన రెండు ఓవర్లలో 11 పరుగులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కానీ మార్ష్, మాక్స్ వెల్ కలిసి 5 బంతులలోనే 12 పరుగులు చేయడంతో 18.5 ఓవర్లలోనే ఆస్ట్రేలియా173 పరుగుల లక్ష్యాన్ని చెందించి ప్రపంచ కప్ సొంతం చేసుకొంది. ఫైనల్స్ వరకు వచ్చిన న్యూజిల్యాండ్ జాట్టు ఈసారైనా ప్రపంచ కప్ గెలుచుకోవాలని ఆశ పడింది కానీ ఈసారి కూడా దాని ఆశ నెరవేరలేదు. 

మిచెల్‌ మార్ష్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, డేవిడ్‌ వార్నర్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు గెలుచుకున్నారు. 

Related Post