భారత్‌లో పర్యటించనున్న న్యూజిల్యాండ్ జట్టు

November 10, 2021
img

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటించనుంది. న్యూజిలాండ్(కివీస్)తో భారత్ మూడు టి-20 లు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు( బీసీసీఐ) మూడు టి-20 మ్యాచ్‌లకు జట్టును ప్రకటించింది. 

టి-20 తరువాత కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో పిచ్ హిట్టర్ రోహిత్ శర్మకు బీసీసీఐ ఆ బాధ్యతలను అప్పగించింది. ఈ మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రిత్ బూమ్రా, మహమ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చింది. ఈసారి జట్టులో పాత, కొత్త సభ్యులు ఉండేలా బీసీసీఐ జట్టును కూర్చింది. టీమ్ ఇండియా చీఫ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత రాహుల్ ద్రవిడ్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. కనుక కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలకు ఇదే మొదటి టి-20 సిరీస్ కానుంది. వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించింది. ఐపీఎల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో అదరగొట్టిన ఆటగాళ్లకు బీసీసీఐ ఈసారి అవకాశం ఇచ్చింది.హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తిరిగి తీసుకున్నారు. న్యూజిల్యాండ్‌తో జరుగబోయే ఈ సిరీస్ భారత్‌లో జరుగబోతున్నందున భారత్‌ జట్టుకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించవచ్చు. 

భారత్ వర్సెస్ న్యూజీలాండ్ టి-20 షెడ్యూల్:

మొదటి టి-20: నవంబర్ 17న, వేదిక: సవాయ్ మాన్సింగ్ స్టేడియం, జైపూర్, రాజస్థాన్. 

2వ టి-20: నవంబర్ 19, వేదిక: ఝార్ఖండ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, రాంచి, ఝార్ఖండ్. 

3వ టి-20: నవంబర్ 21, వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్. 

వీటి తర్వాత భారత్‌-కివీస్ రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. 

 టి-20 భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్( వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, యజుర్వేద చాహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్.

Related Post