క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టిన పీవీ సింధు

October 22, 2021
img

డెన్మార్క్ లో జరుగుతున్న ఓపెన్ బ్యాడ్మింటన్-1000లో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్‌లో దూసుకెళ్లింది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత సింధుకి ఇది తొలి టోర్నమెంటు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సింధు థాయిలాండ్‌కు చెందిన బుసానూన్‌పై గెలిచి క్వార్టర్‌  ఫైనల్లోకి అడుగు పెట్టింది. సింధు 21-18, 12-21, 21-15 తేడాతో బుసానూన్‌పై ఘన విజయం సాధించిది. క్వార్టర్స్‌లో సింధు కొరియాకు చెందిన ఆన్ సియాంగ్‌తో పోటీ పడనుంది. ఇక మరో మ్యాచ్‌లో పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ జపాన్‌కు చెందిన కెమెటా మేమాట చేతిలో ఓటమి పాలయ్యాడు. మిక్స్ డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి-ధ్రువ్ కపిల జంట హాంకాంగ్ క్రీడాకారులు చేతిలో ఓటమి పాలయ్యారు.


Related Post