ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు షురూ

October 20, 2021
img

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. భారత్ వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో పోటీ పడింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. నేడు భారత్ ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత సూపర్ 12 రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

భారత్ టీ-20, సూపర్-12 రౌండ్ షెడ్యూల్: 

అక్టోబర్ 24:  భారత్ వర్సెస్ పాకిస్తాన్ , వేదిక దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం,

అక్టోబర్ 31:  భారత్ వర్సెస్ న్యూజిలాండ్, వేదిక దుబాయ్,

నవంబర్ 3: భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, వేదిక అబుదాబి అంతర్జాతీయ స్టేడియం,

నవంబర్ 5: భారత్ వర్సెస్ బి 1లో గెలిచి పాయింట్లు సాధించిన టీంతో, వేదిక దుబాయ్, 

నవంబర్ 8: భారత్ వర్సెస్ A2లో అధిక పాయింట్లు సాధించిన టీంతో, వేదిక దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం.

ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమాన ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం అవుతాయి.

భారత్‌ టీం (అంచనా) :

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్, జస్ప్రిత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్, హార్థిక్ పాండ్యా, రాహుల్ చహర్, రవిచంద్రన్  అశ్విన్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా. మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు టీంలో సల్ప మార్పులు ఉండవచ్చు.

Related Post