బుర్జ్ ఖలీఫాపై కొత్త జెర్సీలలో టీం ఇండియా

October 16, 2021
img

ఈ ఆదివారం నుంచి టీ-20 ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌లు యూఏఈ, ఒమేన్ వేదికలలో ప్రారంభంకానున్నాయి. ఈనేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ సంస్థ(బీసీసీఐ) బిలియన్ చీర్స్ పేరిట కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఆదివారం నుంచి ప్రారంభంకానున్న టి-20 ప్రపంచ కప్‌లో భారత క్రికెటర్లు ఈ కొత్త జెర్సీలలో కనిపించనున్నారు. ఇందుకు సంబంధించిన కొత్త జెర్సీని ప్రఖ్యాత స్పోర్ట్స్ సంస్థ ఎంపిఎల్ రూపొందించింది. ఈ కొత్త జెర్సీ డార్క్ బ్లూ కలర్‌లో ఉంది.

భారత క్రికెటర్లు ధరించబోయే ఈ జెర్సీ ఫోటోలను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫాపై నిన్న రాత్రి ప్రదర్శించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు కొత్త జెర్సీలలో దిగిన ఫోటోలను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. దీంతో భారత క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్‌గా మారాయి. ఇంతకుముందు గత సంవత్సరం బుర్జు ఖలీఫాపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫోటోను ప్రదర్శించారు. అలాగే ఐపీఎల్ సీజన్-14 ప్రారంభంలో కోల్‌కతా నైట్ రైడర్స్ లోగో, క్రికెటర్ల ఫోటోలను కూడా ప్రదర్శించారు.

Related Post