డీసిపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం

October 11, 2021
img

దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసి)పై ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. అంతకుముందు సిఎస్‌కె టాస్ గెలిచి డీసి బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. డీసి బ్యాటింగ్‌లో పృథ్వీషా, రిషబ్ పంత్ చెలరేగి ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఐదు వికెట్లను కోల్పోయింది. డీసి ఇచ్చిన 173 భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు సిఎస్‌కె తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రారంభంలో దూకుడుగా ఆటతీరును  ప్రదర్శించినప్పటికీ మిడిల్ ఓవర్లలో బ్యాట్స్ మెన్ అనవసరమైన షాట్లు కొట్టి వికెట్లు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఎంఎస్ ధోని క్రీజ్‌లో నిలదొక్కుకుని సిఎస్‌క్‌ జట్టుకు విజయాన్ని అందించాడు. ధోని చేసింది 16 పరుగులే అయినా నలువైపులా షాట్లను కొట్టి ప్రేక్షకులను అలరించాడు. సిఎస్‌కె బ్యాటింగ్‌లో ఋతురాజ్ గైక్వాడ్ 70, రాబిన్ ఊతప్ప 63 పరుగులతో  టాప్ స్కోరర్స్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో ఋతురాజ్ గైక్వాడ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఐపీఎల్‌లో ఈ రోజు  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య షార్జా అంతర్జాతీయ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

Related Post