సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ విజయం

October 09, 2021
img

శుక్రవారం రాత్రి అబుదాబి అంతర్జాతీయ  స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌)  ముంబై ఇండియన్స్ (ఎంఐ) చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఎంఐ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఎంఐ బ్యాట్స్ మ్యాన్ అద్భుతమైన షాట్లతో ప్రేక్షకులను అలరించారు. ఎంఐ నిర్ణీత 20 ఓవర్లలో 235 భారీ పరుగులను సాధించింది. ఈ క్రమంలో తొమ్మిది వికెట్లను కోల్పోయింది. ఎంఐ బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ గ్రౌండ్ నలువైపులా షాట్లను కొట్టి ఏస్‌ఆర్‌హెచ్‌  బౌలర్లను బెంబేలెత్తి చాడు. ఇషాన్ కిషన్ 32 బాల్స్‌లోనే 84 రన్స్ చేసి అదరగొట్టాడు. ఎంఐ ఇచ్చిన 236 భారీ పరుగుల లక్ష్యాన్ని ఎస్‌ఆర్‌హెచ్‌ చేధించలేక ఓటమిపాలైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులు చేసి ఎనిమిది వికెట్లను కోల్పోయింది.ఈ ఓటమితో ఎస్‌ఆర్‌హెచ్‌ ఐపీఎల్ సీజన్-14 నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కు  మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ లీగ్ దశ పూర్తయింది.

ఆదివారం నుంచి ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లు.. షెడ్యూల్: 

ఆదివారం మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ దుబాయ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.

అక్టోబర్ 11న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో గెలిచిన జట్టు ముందుకెళ్తుంది. షార్జా అంతర్జాతీయ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.

అక్టోబర్ 13 క్వాలిఫైయర్ మ్యాచ్ షార్జాలో జరగనుంది. ఇందులో మొదటి క్వాలిఫైయర్‌లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ దశలో గెలిచిన జట్టు పోటీ పడనున్నాయి.

అక్టోబర్ 15 ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌తో ఐపిఎల్ సీజన్ 14 ముగుస్తుంది.

Related Post