డీసీపై ఆర్‌సిబి విజయం

October 09, 2021
img

దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్(డిసీ)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సిబి)సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండు టీంలు చక్కటి ఆటతీరును ప్రదర్శించాయి. గెలుపు కోసం రెండు టీంలు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అంతిమ విజయం ఆర్‌సిబిదే అయ్యింది. 

అంతకుముందు ఆర్‌సిబి టాస్ గెలిచి డిసీకి బ్యాటింగ్ అప్పగించింది. డిసీ నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసి ఐదు వికెట్లను కోల్పోయింది. ఈ మ్యాచ్ లో ఆర్‌సిబి ఓపెనర్లు చాలా తక్కువ పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ నాలుగు పరుగులకే అవుటయ్యి మరోసారి నిరాశ పరిచాడు. ఆ తర్వాత వచ్చిన తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ టీంను ఆదుకున్నాడు. భరత్ తనదైన శైలిలో దూకుడుగా ఆడటంతో ఆర్‌సిబి విజయం సాధించింది. ఒక దశలో ఆర్‌సిబి పరాజయం పాలవుతుందని అభిమానులు భావించారు. కానీ వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ భరత్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. దీంతో ఆర్‌సిబి నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులు చేసి మూడు వికెట్లను కోల్పోయింది. ఆర్‌సిబి బ్యాటింగ్‌లో శ్రీకర్ భరత్ 78, గ్లెన్ మాక్స్ వెల్ 51 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో శ్రీకర్ భరత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Related Post