భారత్, ఇంగ్లాండ్ చివరి టెస్ట్ మ్యాచ్ రద్దు

September 11, 2021
img

భారత్, ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం మాంచెస్టర్, ఓల్డ్ ట్రాన్ఫార్డ్ స్టేడియంలో జరగవలసిన చివరి టెస్ట్ మ్యాచ్ రద్దయింది. భారత జట్టు కోచ్ రవిశాస్త్రి, ఫిజియోథెరపిస్ట్, ఫీల్డింగ్ కోచ్‌లు కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో వీరిని హోమ్ క్వారంటైన్ ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరుజట్ల సభ్యులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించగా అందరికీ నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ ఆటగాళ్లు ఆడడానికి సుముఖంగా లేరు. దీంతో ఇరుజట్ల కెప్టెన్లు చర్చించుకొని తర్వాత మ్యాచ్‌ను వాయిదా వేశారు. నేడు మరోసారి దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

భారత్ ఇప్పటికే సిరీస్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. చివరి టెస్టులో కూడా విజయం సాధించి భారత్‌ సిరీస్ సొంతం చేసుకొంటుందని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులు ఈ మ్యాచ్ రద్దవడంతో తీవ్ర నిరాశ చెందారు. 


Related Post