నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘన విజయం

September 07, 2021
img

లండన్ ఓవల్ స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై భారత్‌ 2 -1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి  210  ఆలౌట్ అయ్యారు. భారత్ ఇచ్చిన 368 పరుగుల లక్ష్యాన్ని చేదించలేకపోవడంతో భారత్ 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో కాస్త  తడబడినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో భారీగా పరుగులను సాధించింది. భారత్ బౌలింగ్, బ్యాటింగ్‌లో సమిష్టిగా రాణించడంతో ఈ విజయం సొంతమైంది. రోహిత్ శర్మకు “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు దక్కింది. భారత్ చివరి టెస్టు మ్యాచ్‌లోనూ సమిష్టిగా రాణించినట్లయితే విజయం సాధించి సిరీస్‌ను సొంతచేసుకొంటుంది. సెప్టెంబర్ 10న చివరి టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫర్డ్ స్టేడియంలో జరగనుంది.

భారత్ మొదటి ఇన్నింగ్స్: 191

 భారత్ రెండో ఇన్ని oగ్స్: 466

ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్: 290

 ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 210

Related Post