భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం, వెండి పతకాలు

September 04, 2021
img

ఈసారి  పారాలింపిక్స్‌లో భారత్‌ క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా పురుషుల షూటింగ్ (పి4- మిక్స్‌డ్) 50 మీటర్ల పోటీలో భారత్‌ షూటర్ మనీష్ అగర్వాల్ స్వర్ణం సాధించగా, ఇప్పటికే షూటింగ్‌లో కాంస్యం సాధించిన ఆదాన సింగ్‌రాజ్‌ నిన్న జరిగిన ఈ పోటీలలో రజత పతకం సాధించారు. 


మహిళల రెండు షూటింగ్ ఈవెంట్‌లలో అవని లేఖరా రెండు మెడల్స్ (స్వర్ణం, కాంస్యం) సాధించగా, పురుషుల రెండు షూటింగ్ ఈవెంట్‌లలో ఆదాన సింగ్‌ రాజ్‌ కూడా రెండు (రజతం, కాంస్యం) పతకాలు సాధించి రికార్డ్ నెలకొల్పారు. 

పురుషుల బాడ్మింటన్‌లో షెట్లర్ ప్రమోద్ భగత్, సుహాస్ యతిరాజ్  ఫైనల్స్‌కు చేరుకోవడంతో వారి ద్వారా భారత్‌కు మరో రెండు పతకాలు లభించనుంది. పురుషుల బాడ్మింటన్‌ సింగిల్స్‌లో సెమీస్‌లో ఓడిపోయిన మనోజ్ సర్కార్ ప్రస్తుతం కాంస్య పతకం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. 

ఇప్పటి వరకు భారత్‌కు మొత్తం 15 పతకాలు లభించాయి. నేడు మరికొన్ని పతకాలు లభించనున్నాయి.        


సంఖ్య

పేరు

దేనిలో

పతకం

1

అవని లేఖరా

షూటింగ్ (10మీటర్లు)

స్వర్ణం

2

అవని లేఖరా

షూటింగ్ (50మీటర్లు)

కాంస్యం

3

మనీష్ నర్వాల్

షూటింగ్ (50మీటర్లు)

స్వర్ణం

4

సింగ్‌రాజ్‌ అథానా

షూటింగ్

రజతం

5

సింగ్‌రాజ్‌ అథానా

షూటింగ్

కాంస్యం

6

సుమిట్ అంటిల్

జావెలిన్ త్రో

స్వర్ణం

7

యోగేశ్ కూతునియా

డిస్కస్ త్రో

రజతం

8

ప్రవీణ్ కుమార్

హైజంప్

రజతం

9

నిషాద్ కుమార్‌

హై జంప్

రజతం

10

భావినా బెన్

టేబిల్ టెన్నిస్

రజతం

11

దేవేంద్రా ఝజారియా

జావెలిన్ త్రో

రజతం

12

సుందర్ సింగ్‌

జావెలిన్ త్రో

కాంస్యం

13

మరియప్పన్ తంగవేల్

హైజంప్

రజతం

14

శరద్ కుమార్‌

హైజంప్

కాంస్యం

15

హర్‌వీందర్ సింగ్

ఆర్చరీ

కాంస్యం

Related Post