టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో 2 పతకాలు

September 03, 2021
img

టోక్యో పారాలింపిక్స్‌లో ఈసారి భారత్‌కు పతకాల పంట పండుతోంది. ఈరోజు భారత్‌కు మరో 2 పతకాలు వచ్చాయి. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మొదట స్వర్ణ పతకం సాధించిన అవని లేఖరాయే మహిళల 50 మీటర్ల షూటింగ్‌లో ఈరోజు భారత్‌కు మరో కాంస్య పతకం సాధించింది. ఈరోజు ఉదయం జరిగిన పురుషుల హైజంప్ పోటీలలో ప్రవీణ్ కుమార్‌ 2.07 మీటర్లు ఎత్తు దూకి రజత పతకం సాధించాడు. దీంతో ఇప్పటివరకు భారత్‌కు రెండు స్వర్ణాలు, ఆరు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు కలిపి మొత్తం 12 పతకాలు లభించాయి. 


టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు వచ్చిన పతకాలు: 

పేరు

దేనిలో

పతకం

అవని లేఖరా

షూటింగ్ (10మీటర్లు)

స్వర్ణం

అవని లేఖరా

షూటింగ్ (50మీటర్లు)

కాంస్యం

సుమిట్ అంటిల్

జావెలిన్ త్రో

స్వర్ణం

యోగేశ్ కూతునియా

డిస్కస్ త్రో

రజతం

ప్రవీణ్ కుమార్

హైజంప్

రజతం

నిషాద్ కుమార్‌

హై జంప్

రజతం

భావినా బెన్

టేబిల్ టెన్నిస్

రజతం

దేవేంద్రా ఝజారియా

జావెలిన్ త్రో

రజతం

సుందర్ సింగ్‌

జావెలిన్ త్రో

కాంస్యం

సింగ్‌రాజ్‌ అథానా

షూటింగ్

కాంస్యం

మరియప్పన్ తంగవేల్

హైజంప్

రజతం

శరద్ కుమార్‌

హైజంప్

కాంస్యం

Related Post