ఓడి గెలిచిన భారత బాక్సర్ సతీష్ కుమార్‌

August 02, 2021
img

ఇండియన్‌ బాక్సర్ సతీష్ కుమార్ పురుషుల 90 కిలోల బాక్సింగ్ విభాగంలో (క్వార్టర్ ఫైనల్స్) ఉజ్బెకిస్తాన్‌ బాక్సర్ జలోవ్‌తో పోటీ పడ్డారు. ఈ మ్యాచ్‌లో సతీష్ కుమార్ 0-5 తేడాతో పరాజయం పాలయ్యాడు. సతీష్ కుమార్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ లో ముఖంపై, నుదుటిపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో  13 కుట్లు పడ్డాయి. అయినా కూడా వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా హోరాహోరీగా పోరాడి భారత్‌కు పతకం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నంలో పరాజయం పాలయ్యాడు. ఈ పోటీలో ఆయన పరాజయం పాలైనప్పటికీ కోట్లాదిమంది భారతీయుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.


Related Post