ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం సాధించిన సింధూ

August 02, 2021
img

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు పీవీ సింధు మరో పతకం సాధించి పెట్టింది. ఆదివారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో పీవీ సింధు చైనాకు చెందిన క్రీడాకారిణి బింగ్ జియాతో పోటీ పడ్డారు. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి సింధు ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ధాటిగా ఆడుతూ వరుస సెట్లలో 21-13, 21,15 తేడాతో ఘనవిజయం సాధించింది. పీవీ సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం, ఇప్పుడు ఈ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలుగమ్మాయిగా చరిత్రలో నిలిచింది.


Related Post