ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు గ్యారెంటీ

July 30, 2021
img

టోక్యో ఒలింపిక్స్‌లో ఈరోజు ఇండియాకు బ్యాడ్మింటన్, మహిళా బాక్సింగ్‌లో రెండు పతకాలు ఖాయం అయ్యాయి.   

బ్యాడ్మింటన్ : తెలుగుతేజం ఇండియా స్టార్ షట్లర్ పీవీ.సింధు విజయాల పరంపరను కొనసాగిస్తుంది. ఈరోజు మహిళా బ్యాడ్మింటన్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో జపాన్‌కు చెందిన ఆకానే యమగుచితో సింధు తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో సింధు ప్రత్యర్థితో హోరాహోరీగా జరిగిన పోటీలో 2-0 తేడాతో విజయం సాధించి విజయం సాధించి సెమిఫైనల్స్ కు చేరుకుంది. సెమీ ఫైనల్స్ లో కూడా గెలిస్తే ఫైనల్స్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. 

మహిళల బాక్సింగ్: లోవ్లీనా బోర్గోహోయిన్ ఒలింపిక్స్‌లో పోటీపడటం ఇదే మొదటిసారి అయినప్పటికీ ప్రత్యర్థిని బలమైన పంచ్‌లతో కట్టడి చేసింది. ఈరోజు క్వార్టర్స్ లో చైనాకు చెందిన నిన్ చిన్ పోటీ పడి 4 -1 తేడాతో లోవ్లీనా విజయం సాధించింది. విజయంతోనే సెమీ ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. సెమీ ఫైనల్స్ ఆగస్టు 4వ తేదీన జరగనుంది. సెమీ ఫైనల్లో గెలిస్తే ఫైనల్స్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.

Related Post