హెవీ వెయిట్ బాక్సింగ్‌లో దూసుకువెళుతున్న సతీష్ కుమార్‌

July 29, 2021
img

టోక్యో ఒలంపిక్స్ ప్రారంభమై నేటికీ వారం గడుస్తున్నా ఇప్పటివరకు ఇండియాకు ఒకే ఒక పతకం దక్కింది. గడిచిన రెండు రోజులుగా వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారులు అద్భుతం ప్రదర్శన కనబరిచి రాణిస్తుండటంతో ఒలింపిక్స్‌లో భారత్‌ స్థానం క్రమంగా మెరుగుపడుతోంది. గురువారం పురుషుల హాకీ జట్టు, విలువిద్య, బాక్సింగ్ పోటీలలో విజయం సాధించి తదుపరి పోటీలకు సిద్ధమయ్యారు.

హాకీ: ఇండియా పురుషుల హాకీ జట్టు అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో 3-1 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇప్పటికే మూడు విజయాలతో మంచి ఊపు మీదున్న ఇండియా హాకీ జట్టు తర్వాత జపాన్‌తో పోటీపడనుంది.

బాక్సింగ్: పురుషుల సూపర్ హెవీ వెయిట్ విభాగంలో సతీష్ కుమార్ చక్కటి పోరాటపటిమను కనబరుస్తున్నాడు. అతను భారత్‌కు తప్పకుండా పతకం తెచ్చే అవకాశం కనిపిస్తోంది. సతీష్ కుమార్‌ జమైకాకు చెందిన బ్రాన్ రికార్డ్ పై 41 తేడాతో ఘన విజయం సాధించి క్వాటర్ ఫైనల్స్ లోకి అడుగు పెట్టాడు. పురుషుల సూపర్ హెవీ వెయిట్ విభాగంలో అర్హత సాధించాడు. సతీష్ కుమార్ ఆగస్టు 1న క్వార్టర్ ఫైనల్స్ లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జలోలోవ్‌తో తలపడనున్నాడు.

ఆర్చరీ (విలువిద్య పోటీలు): వ్యక్తిగత విలువిద్య పోటీలో ఆతాను దాస్ ఫ్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నాడు. ఆతాను దాస్ రౌండఫ్-16లో కొరియా క్రీడాకారునిపై 6-5 తేడాతో ఘన విజయం సాధించాడు. అతాను దాస్ ఈనెల 31న రౌండ్ ఆఫ్ ఎయిట్‌లో జపాన్‌కు చెందిన క్రీడాకారుడితో పోటీ పడనున్నారు.

Related Post